ప్ర‌ధానిపై వ‌ర్మ కౌంట‌ర్ కామెంట్లు.. అలా అన్నాడేంటి!

ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించే డైరెక్ట‌ర్ ఆర్జీవీ ఈ సారి ఏకంగా ప్ర‌ధాని మోడీపైనే వ్యంగ్యంగా ట్వీట్ చేసి వైర‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా ప‌రిస్థితుల‌పై స్పందిస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ ట్వీట్ చేశారు. మోడీ గారు మిమ్మ‌ల్ని ఓ ప్ర‌శ్న వేయాల‌నుంది. ప్ర‌పంచం మొత్తం మ‌నం సాయం కోసం అర్జిస్తున్నాం క‌దా మరి మ‌న ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ఏమైంది అని ట్వీట్ చేశారు.


ఇక దీని త‌ర్వాత మ‌రో ట్వీట్ చేస్తూ.. మోడీగారు మీరు మంచి హార‌ర్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ అంటూ వ్యంగ్రాస్త్రాలు సంధించారు. మీరు ప్ర‌ధాని ప‌ద‌వి కోల్పోతే.. F**k ఇండియా అని మీరు అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హార‌ర్ విజువ‌ల్స్ ను బాగా చూపిస్తున్నారు. మీరే మంచి హార‌ర్ సినిమా డైరెక్ట‌ర్ అని సెటైర వేశాడు.
ఇక మ‌రో ట్వీట్ లో ప్ర‌ధాని మోడీ మీరు తీయ‌బోయే హార‌ర్ ఫిల్మ్ లో నాకు మేక‌ర్ గా జాబ్ ఇప్పించండి. నాకు క్ల‌ర్క్ జాబ్ అంటే ఇష్టం. నేను మృత‌దేహాల లెక్క‌లు చూస్తాను అని క‌రోనా మృతుల‌కు నిర‌స‌న‌గా అలా ట్వీట్ చేశారు. న‌రేంద్ర మోడీ ఓ మృత్యు వ్యాపారి అని, ఈ విష‌యంలో తాను సోనియా గాంధీకి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని ట్వీట్ చేశారు. ఇక దేశంలో నిన్న జరిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోవ‌డంపై కూడా సెటైర్ వేశాడు. మోడీ గారు బెంగాల్ లో దీదీ ఫినిష్ అని అన్నారు.. మ‌రి ఇప్పుడు ఏమంటారు అని కౌంట‌ర్ వేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైర‌ల్ గా మారాయి.