బ్రేకింగ్: ఐపిఎల్ లో కరోనా కలకలం, నేటి మ్యాచ్ రద్దు…!

ఐపిఎల్ లో కలకలం రేగింది… ఆటగాళ్లకు కరోనా రావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కలకత్తా జట్టులో కొందరు ఆటగాళ్లకు కరోనా సోకిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. అయితే ఆ ఆటగాళ్ళు ఎవరూ ఏంటీ అనే దానిపై బోర్డ్ ప్రకటన చేయలేదు. ఆటగాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే ఐపిఎల్ లో ఆటగాళ్ళు ఆడటానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. చాలా మంది ఆటగాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఆటగాళ్ళు కొందరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. త్వరలోనే హైదరాబాద్ ఆటగాళ్ళు కూడా కొందరు వెళ్ళిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.