విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా?

విజ‌య్ ముగ్గురు అమ్మాయిల‌ని ప్రేమిస్తార‌ట‌. ముగ్గురితోనూ బ్రేక‌ప్ అవుతుంద‌ట‌. చివ‌ర‌కు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతార‌ట‌.

టాలీవుడ్ యువ సంచ‌ల‌నం, అభిమానులు ముద్ధుగా పిలుచుకునే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింద‌ట‌. ఒక్క‌సారి కాదు మూడు సార్లు ఆయ‌న ప్రేమ‌లో ప‌డ్డార‌ని, ముగ్గురు అమ్మాయిల‌తోనూ త‌న ప్రేమ విఫ‌ల‌మైంద‌ని తెలుస్తుంది.

Vijay devarakonda love breaks up

అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న విజ‌య్ మాకు తెలియ‌కుండా ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు? ఎప్పుడు బ్రేక‌ప్ అయ్యిందా? అనే సందేహం రావ‌చ్చు. కానీ అది రియ‌ల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో అట‌.

విజ‌య్ ప్ర‌స్తుతం మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఇది గ‌తేడాది ద‌స‌రా పండుగ‌ని పుర‌స్క‌రించుకుని గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

ఇందులో న‌లుగురు హీరోయిన్లు రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, కేథ‌రిన్ థ్రెస్సా, ఇస‌బెల్లా.. విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. అయితే సినిమాలో విజ‌య్ ముగ్గురు అమ్మాయిల‌ని ప్రేమిస్తార‌ట‌. ముగ్గురితోనూ బ్రేక‌ప్ అవుతుంద‌ట‌. చివ‌ర‌కు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతార‌ట‌. త‌న లైఫ్‌లో వ‌రుస‌గా బ్రేక‌ప్స్ ఉండ‌టంతో ఈ సినిమాకి బ్రేక‌ప్ అనే టైటిల్‌ని నిర్ణ‌యించే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంద‌ట‌.

మ‌రోవైపు ఇందులో విజ‌య్ తండ్రిగానూ క‌నిపించ‌నున్న‌ట్టు, త‌న‌కు ఎనిమిదేండ్ల కుమారుడు కూడా ఉంటార‌ని తెలుస్తుంది. మ‌రి ఇంత యంగ్ ఏజ్‌లో తండ్రి పాత్ర‌లో న‌టించి విజ‌య్ రిస్క్ చేస్తున్నాడా? అనే ఆందోళ‌న ఆయ‌న అభిమానుల్లో క‌లుగుతుంది. ఈ సినిమాని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ అధినేత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు.

దీంతోపాటు విజ‌య్ ప్ర‌స్తుతం భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో డియ‌ర్ కామ్రేడ్‌లో న‌టిస్తున్నారు. గీత గోవిందం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్నా ఇందులో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తుంది. క్రికెట్‌, కాలేజ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాని జులై 26న విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు, టీజ‌ర్ సినిమాపై క్రేజ్‌ని పెంచుతున్నాయి. మ‌రోవైపు త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నమ‌లై ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న హీరో సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే ఈ సినిమాలో మ‌ల‌యాళ‌ న‌టి మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.