1997లో సల్మాన్ నటించిన ‘జుడ్వా’ సినిమా తెలుగులో 1994లో నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య హీరోహీరోయిన్లుగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘హలో బ్రదర్’ కి రీమేక్. ఇది హిందీలో కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో 1989లో వెంకటేష్, రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమ’ సినిమాని సల్మాన్ హిందీలో ‘లవ్’ పేరుతో రీమేక్ చేశారు.
బాలీవుడ్‌లో సల్మాన్ అగ్ర హీరోగా నిలబడటంలో, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడంలో రీమేక్ సినిమాల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా కెరీర్ పరంగా పడిపోతున్న టైమ్‌లో తెలుగు సూపర్ హిట్స్ ని రీమేక్ చేసి విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సల్మాన్ నటించిన తెలుగు రీమేక్‌లో అందరికి బాగా గుర్తుండే చిత్రం ‘పోకిరి’. మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు అనే మాటని క్రియేట్ చేసిన చిత్రమిది. దీన్ని సల్మాన్ ‘వాంటెడ్’ గా రీమేక్ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించడం విశేషం.
అదే కాదు అంతకంటే ముందు కూడా చాలా సినిమాలు రీమేక్ చేశారు. 1997లో ఆయన నటించిన ‘జుడ్వా’ సినిమా తెలుగులో 1994లో నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య హీరోహీరోయిన్లుగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘హలో బ్రదర్’ కి రీమేక్. ఇది హిందీలో కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో 1989లో వెంకటేష్, రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమ’ సినిమాని సల్మాన్ హిందీలో ‘లవ్’ పేరుతో రీమేక్ చేశారు. దీనికి సురేష్ కృష్ణ దర్శకుడు. రేవతి కథానాయిక. ఇది కూడా మంచి హిట్‌ని అందుకుంది. దీంతోపాటు రామ్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిన ‘రెడీ’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో అనీస్ బజ్మీ దర్శకత్వంలో రీమేక్ చేసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమాని అదే పేరుతో సాజిద్ నడియడ్ వాలా దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా బ్లాక్‌బస్టర్ సాధించిన మహేష్ ‘మహర్షి’ చిత్రాన్ని కూడా రీమేక్ చేసే ఆలోచనలో సల్మాన్ ఉన్నారట.
సినిమా చూశాక నచ్చితే వెంటనే రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అన్నీ కుదిరితే ఈ రీమేక్‌కి ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘వాంటెడ్’కి ప్రభుదేవానే దర్శకత్వం వహించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘దబాంగ్ 3’ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ‘మహర్షి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇలా చాలా తెలుగు సినిమాలు సల్మాన్‌ని స్టార్‌ని చేశాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన ‘భారత్’ లో నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన ఈ సినిమా జూన్ 5న రంజాన్ కానుకగా విడుదల కానుంది.