పదేళ్లు వెనక్కెళ్లిన విజయ్..తలపతి క్లాసీ లుక్ ఫొటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ..నటించిన ‘బీస్ట్’ పిక్చర్ ఇటీవల విడుదలై సక్సెస్ అయింది. తలపతి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమా చేస్తున్నారు. ‘తలపతి 66’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. కాగా, ఈ ఫిల్మ్ లో యంగ్ విజయ్ ను చూడబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చేశారు.

విజయ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో విజయ్ చాలా యంగ్ గా కనబడుతున్నారు. మొన్నటి వరకు తెల్లటి నెరిసిన గడ్డం, జుట్టుతో ఉన్న విజయ్..ప్రస్తుతం క్లాసీ లుక్ తో అదరగొడుతున్నారు.

విజయ్ ఫొటో చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నాయి. తమ హీరో పదేళ్లు వెనక్కు వెళ్లారని కామెంట్స్ చేస్తు్న్నారు. ఇక ‘తలపతి 66’ పిక్చర్ లో భారీ తారాగణమే ఉంది. మేకర్స్ వరుసగా ఇందులో నటించబోయే నటీ నటుల గురించి ప్రకటిస్తూనే ఉన్నారు.

‘రేసుగుర్రం’ సినిమాలో బన్నీ బ్రదర్ గా నటించిన శ్యామ్, ప్రభు, ప్రకాశ్ రాజ్, జయసుధ, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తదితరులు ఈ పిక్చర్ లో కీలక పాత్రలు పోషించనున్నారు. ఇంత మంది స్టార్ కాస్ట్ చూస్తుంటే డెఫినెట్ గా ఇది మరో ‘బృందావనం’ పిక్చరేనని, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లానే ఉంటుందని వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది జనవవరి లో సంక్రాంతి కానుకగా ‘తలపతి 66’ విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.