బాలీవుడ్‌లో మరో సౌత్ రీమేక్.. ‘విక్రమ్ వేద’లో అదరగొట్టిన హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్..

-

బాలీవుడ్ లో ప్రజెంట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ సత్తా చాటుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘కార్తీకేయ-2’ హిందీ బెల్ట్ లో రికార్డు వసూళ్లు చేస్తోంది. ఇక సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ను సేమ్ డైరెక్టర్స్ తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. అలా రీమేక్ అయిన మరో చిత్రం ‘విక్రమ్ వేద’. సేమ్ టైటిల్ తో హిందీలో ఈ సినిమాను తీశారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్.ఆర్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ను హిందీ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్.. తో కలిసి తీశారు. పుష్కర్, గాయత్రి కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వచ్చే నెల 30న చిత్రం విడుదల కానుంది.

రాధికా ఆప్టే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచికి, చెడుకు మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నను టీజర్ లేవనెత్తింది. ఒరిజినల్ లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తుండగా, ఆర్. మాధవన్ రోల్ ను సైఫ్ అలీఖాన్ ప్లే చేస్తున్నారు. చూడాలి మరి.. ఈ సినిమాతో హిందీ స్టార్స్ విజయం అందుకుంటారో..

Read more RELATED
Recommended to you

Latest news