ఓటీటీలోకి వచ్చేసిన ‘విమానం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

డైరెక్టర్, నటుడు సముద్రఖని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘విమానం’. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్కుకుంది. మంచి టాక్​ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఈ సిిమా ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 30వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏంటంటే.. : విక‌లాంగుడైనా క‌ష్ట‌పడి ప‌నిచేసే మ‌న‌స్త‌త్వ‌మున్న వ్య‌క్తి వీర‌య్య (సముద్ర‌ఖ‌ని). భార్య మ‌ర‌ణించ‌డంతో త‌న కొడుకు రాజు (ధ్రువ‌న్‌)తో క‌లిసి ఓ బ‌స్తీలో జీవ‌నం సాగిస్తుంటాడు. ఆటోస్టాండ్ ద‌గ్గ‌ర మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌తో వ‌చ్చే చాలీ చాల‌ని సంపాద‌నే ఆ కుటుంబానికి ఆధారం. బ‌డికి వెళ్లే రాజుకి విమానం అంటే ఇష్టం. పెద్ద‌య్యాక పైలట్ కావాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. అయితే రాజు పెద్ద‌య్యే వ‌ర‌కూ కాకుండా… నెల రోజుల్లోపేవిమానం ఎక్కించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. త‌న కొడుకు కోరిక‌ని నెర‌వేర్చేందుకు ఆ తండ్రి ఏం చేశాడు? ఆ బ‌స్తీలోనే ఉండే సుమ‌తి (అన‌సూయ‌), కోటి (రాహుల్ రామ‌కృష్ణ‌), డేనియ‌ల్ (ధ‌న్‌రాజ్‌)ల జీవితాల వెన‌క క‌థేమిటి? వీర‌య్యకి వాళ్లు ఎలా సాయం చేశార‌నేది జీ5లో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news