దగ్గుబాటి రానా హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా జంటగా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ విరాటపర్వం సినిమా విశేషాలను అలాగే మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో.. ట్విస్ట్ ఇవ్వడమో.. లాంటివి మాత్రమే చేశాను . కానీ విరాటపర్వం సినిమాలో పూర్తి కథనే తలకిందులు చేసే పాత్రలో నేను కనిపిస్తున్నాను..ఇక ఇందులో నా పాత్ర పేరు రఘన్న. సీనియర్ ఉద్యమకారుడు పాత్రలో కనిపిస్తున్నాను . ఇక ఉద్యమం తప్ప.. దేన్ని లెక్కచేయకుండా ఎమోషనల్ ఫీలింగ్ కాకుండా ఉంటాను ..కాబట్టే గ్రూప్లో నాకు సీనియర్ గుర్తింపు దక్కాల్సిన నా పాత్ర జూనియర్ ఉద్యమకారుడిగా ఉంటుంది. ప్రియమణి గారు భారతక్క పాత్రలో కనిపిస్తారు. ఇక ఆమె నటన అమోఘం అని చెప్పవచ్చు. ఇక మా రెండు పాత్రలు రవన్న పాత్ర పోషిస్తున్న రానా కీ చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఉద్యమం విధానాలే ముఖ్యము అన్న పాత్రలో మేము పోషించాము.ఇక సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించి .. ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఇందులో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమ కథను కూడా విరాటపర్వం సినిమాలో మీరు చూడవచ్చు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఇష్టంగా చేశాను. బలమైన పాత్రలను చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో నేను కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. 35 నిమిషాల పాటు నా పాత్ర ఒక బ్లాస్ట్ లాగా తేలుతుంది. ఇంతటి పవర్ఫుల్ పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ నవీన్ చంద్ర తెలిపారు.