ఆచార్య కోసం వెయిటింగ్ ఇక్క‌డ ? మా మాస్టార్ మాట‌ల స్టార్ !

పాఠాలు చెప్పే మాస్టారు..నిన్న‌టి వ‌ర‌కూ..
ఇప్పుడు తుపాకీ ప‌ట్టి మ‌రికొన్ని సూత్రాలు
వివ‌రిస్తున్నారు.. అవ‌న్నీ అభ్యుద‌య మార్గంలో
ఉన్న‌వి.. సామాజిక మార్పు కోసం ఉద్దేశించిన‌వి
ఏ క‌థ‌కు అయినా మూలం అడ‌వే !
ఆ విధంగా అడ‌విలో పుట్టిన క‌థకు మ‌రికొంత గ్లామ‌ర్ యాడ్ చేశారు
ఆ గ్లామ‌ర్ చిరూది మ‌రియు మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌రణ్ ది కూడా !
ఆ వివ‌రం ఈ ప్ర‌త్యేక క‌థ‌నంలో…

మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమా ముచ్చట్లు వినిపించాయి..ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పై పడింది..ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఒకే ఫ్రేమ్ లో తండ్రి కొడుకులు కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది.. చిరు సరసన కాజల్ తొలుత నటించగా, క‌థన రీత్యా ఆమె న‌టించిన స‌న్నివేశాల‌ను తొల‌గించారు.

అయితే చరణ్ సరసన మాత్రం బ్యూటీ డాళ్ పూజాహెగ్డే నటించి, నీలాంబ‌రి పాత్ర‌లో అల‌రించింది..అంతేకాదు ఈ సినిమాలో అనుష్క ఓ పాటలో కనిపించనుంద‌ని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. మాస్, యాక్షన్, రోమాన్స్ జొనర్ లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు వచ్చిన అన్ని విజువ‌ల్ అప్డేట్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ పెంపొందిస్తున్నాయి.

కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుద‌ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని విడుదలకు సిద్ధ‌మవ్వ‌డంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఏప్రిల్ 29 న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనుండ‌డంతో వారి ఆనందాల‌కు అవ‌ధులే లేవిక‌. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండ‌డంతో థియేట‌ర్ల ద‌గ్గ‌ర వివిధ అభిమాన సంఘాల ప్ర‌తినిధులు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు.

మ‌రోవైపు చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది. ఇందులో భాగంగా తాజాగా చిరు, చరణ్ లు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సినిమా లోని కీలక సన్నివేశాల గురించి ప్రేక్ష‌కుల‌కు కొన్ని హింట్లు ఇచ్చి, ప్రాజెక్ట్ పై హైప్ పెంచారు. ఈ సంద‌ర్భంగా చరణ్ పై మెగాస్టార్ వేసిన పంచులు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్ర‌మోష‌న్ల‌లోనే కాదు వీరిద్దరి సంభాషణ సినిమాకే హైలెట్ అవుతుందని, చిరు ఖాతాలో మరో భారీ హిట్ పడనుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.