నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్ కింద ఉంచిన ఆయనను వైద్యులు అహర్నిశలు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు.. అంతే కాదు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి.
తారకరత్న అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయి అనే విషయం మరింత వైరల్ గా మారుతుంది.. తారకరత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే ఏర్పాటులో ప్రారంభమయ్యాయి.. ఆదివారం ఉదయానికి హైదరాబాదులోని మోకిలా లో ఉన్న ఆయన సొంత ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, పార్టీ టిడిపి నేతలు, పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించనున్నారు.
మోకిలా లోని ఇంటి నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ కు తారకరత్న భౌతిక కాయాన్ని తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు, ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఫిలింనగర్లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర మొదలుకానుంది. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే 39 సంవత్సరాలు వయసులోనే తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను , తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచి వేస్తోంది. 2002లో ఇండస్ట్రీలోకి వచ్చిన అయిన 25 సినిమాలు చేశారు. అయితే హీరోగా విజయం దక్కించుకోలేదు.. కానీ అమరావతి సినిమాలో విలన్ గా నటించి తన నటనతో మెప్పించి నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు..