పవన్ భుజాలపై ఉన్న బాబు ఎవరో చెప్పుకోండి చూద్దాం.. వైరల్ ఫోటో

-

మెగా కుటుంబంలోని ఓ హీరో ఆ ఫోటోను షేర్ చేశాడు. ముగ్గురు మెగా బ్రదర్స్.. మధ్యలో ఉన్న పవన్‌పై ఓ బాబు కూర్చొని ఉంటాడు. ఆ బాబు ఎవరో చెప్పుకోండి చూద్దాం. కాస్త కష్టమే అయినా.. పోలికలను బట్టి ఈజీగా చెప్పేయొచ్చు.

మెగా ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీలో అరుదైన గుర్తింపు ఉంటుంది. మెగా ఫ్యామిలీకి ఇంత గుర్తింపు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఆయన మెగాస్టార్ కాకుండి ఉంటే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలిసి ఉండేది కాదు. ఆయన నిర్మించిన సామ్రాజ్యంలో మెగా ఫ్యామిలీ అంతా సేద తీరుతున్నారు. సరే.. అవన్నీ పక్కన బెడితే ప్రస్తుతం ఓ ఫోటో అది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

who is this cute boy on pawan kalyan shoulder?

మెగా కుటుంబంలోని ఓ హీరో ఆ ఫోటోను షేర్ చేశాడు. ముగ్గురు మెగా బ్రదర్స్.. మధ్యలో ఉన్న పవన్‌పై ఓ బాబు కూర్చొని ఉంటాడు. ఆ బాబు ఎవరో చెప్పుకోండి చూద్దాం. కాస్త కష్టమే అయినా.. పోలికలను బట్టి ఈజీగా చెప్పేయొచ్చు. ఆ బాబు ఇప్పుడు హీరో. ఈ క్లూ చాలా ఇంకా చెప్పాలా? సరే.. ఆ ముగ్గురు బ్రదర్స్‌లోని ఒకరి కొడుకే ఆ బాబు. ఇన్ని క్లూస్ ఇచ్చాక కూడా మీరు చెప్పలేకపోతే ఎలా?

ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఇటీవల వచ్చిన ఎఫ్2 సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ను బ్రో.. బ్రో అంటూ పిలిచాడు కదా.. వరుణ్ తేజ్. అవును.. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. తన బాబాయ్ భుజాల మీద ఎక్కి కూర్చొని ఏం చక్కా ఆడుకుంటున్నాడో చూడండి.

ఎక్కడో ఉన్న పాత ఫోటోల్లో దొరికింది ఇది. నాకు చాలా ఇష్టమైన వాళ్లతో నేను.. వీళ్లను ఎంతో ప్రేమిస్తున్నా.. అంటూ క్యాప్షన్ పెట్టి.. ఆఫోటోను షేర్ చేశాడు వరుణ్ తేజ్. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఎవరో కనుక్కోండి అంటూ సినీ అభిమానులకు సవాల్ విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news