ఎన్.టి.ఆర్ మహానాయకుడుపై జూనియర్ సైలెన్స్ వెనుక కారణాలు..!

682

నందమూరి హీరోలు వారు చేసే పనుల వల్ల ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నరన్నది నిజం. అదెలా అంటే కొన్నాళ్లుగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్ ల మధ్య మాటల్లేవు.. హరికృష్ణ మరణంతో వారిద్దరు దగ్గరయ్యారు. ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. అందరి గురించి మాట్లాడి ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడటం మరిచాడు. అది మరచినట్టు కాదు.. కావాలనే బాలకృష్ణ ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడలేదని అనుకున్నారు.

ఇప్పుడు జూనియర్ టర్న్ వచ్చింది. బాలకృష్ణ నటించి నిర్మించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ పై తారక్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. బయోపిక్ ఆడియో ఈవెంట్ లో నందమూరి కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఎన్.టి.ఆర్ కూడా వచ్చాడు. స్టేజ్ మీద బాబాయ్ ను పొగుడుతూ ఇచ్చిన స్పీచ్ కూడా బాగుంది. అయితే తర్వాత సినిమా వచ్చాక సైలెంట్ అయ్యాడు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు మాత్రమే కాదు నిన్న రిలీజైన మహానాయకుడు సినిమాపై కూడా తారక్ ఎలాంటి కామెంట్ పెట్టలేదు.

పైకి దగ్గరైనట్టు కనిపిస్తున్నా లోపల దూరం అలానే ఉందని ఈ వ్యవహారాలు చూస్తే అర్ధమవుతుంది. అసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి తారక్ స్పందించకపోవడం వెనుక కారణాలేంటి అన్న కోణంలో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.