తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం మద్దతు ఇవ్వాలని ఈసందర్భంగా కేటీఆర్.. ఉత్తమ్ ను కోరారు. ఈక్రమంలో వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నది.
నా ఫోన్ నెంబర్ ను ఎందుకు బ్లాక్ చేశారు కేటీఆర్.. అంటూ ఉత్తమ్ కేటీఆర్ ను అడిగారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. మీ నెంబర్ ను నేను బ్లాక్ చేయగలనా? నేను మెసేజ్ లు మాత్రమే చూస్తా.. అంటే తెలిపారు. అలా వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవం కోసం కేటీఆర్ అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్కమార్కతో భేటీ అయ్యారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. సోమవారం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది.