టీవీలో వచ్చే కలర్స్ యాడ్ తెలుసు కదా మీకు. రంభ, రాశి, ఇతర హీరోయిన్లు తమ బరువును ఎలా తగ్గించుకున్నారో చెబుతూ.. కలర్స్ లో మీరు ఎంతో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. దీంతో అధిక బరువుతో బాధపడేవాళ్లు వాళ్ల ప్రకటనలకు ఆకర్షితులై ఆ సంస్థలో చేరడం.. అనుకున్న సమయానికి బరువు తగ్గకపోవడంతో మోసపోయామని గ్రహించడం… చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిది. అయితే.. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి రంభ, రాశి యాడ్స్ చూసి కలర్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో చేరాడట.
కాకపోతే.. ఆ వ్యక్తి బరువు తగ్గలేదట. దీంతో తనను కలర్స్ సంస్థ మోసం చేసిందని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన వినియోగదారుల ఫోరం జడ్జ్ మాధవరావు మాధవరావు.. వినియోగదారుడిని మోసం చేసినందుకు కలర్స్ సంస్థకు జరిమానా విధించారు. బాధితుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం పే చేసిన 74,652 రూపాయలను 9 శాతం వడ్డీ కలిపి తక్షణమే చెల్లించాలంటూ కలర్స్ కు ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాదు.. రాశి, రంభలతో రూపొందించిన కలర్స్ యాడ్స్ ను కూడా తక్షణమే టీవీల్లో ప్రసారం చేయడం ఆపేయాలని… వాళ్లే కాదు.. ఇటువంటి యాడ్స్ లో ఏ సెలబ్రిటీలు కూడా నటించొద్దంటూ న్యాయమూర్తి ఆదేశించారు. సెలబ్రిటీలు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ ను నటించకూడదని మాధవరావు హెచ్చరించారు. మరోసారి ఇటువంటి యాడ్స్ లో సెలబ్రిటీలు నటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.