అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు చిత్ర బృందం. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఒకేసారి నాలుగు భాషలకి సంబధించిన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ రగ్డ్ లుక్‌లో మాచి మాసీగా కనిపిస్తున్నాడు. ఇక ‘రంగస్థలం’ మాదిరిగా 1980ల కాలంలో సాగే కథ అని సమాచారం.
ఇక ‘పుష్ప’ సినిమాను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నామంటూ మేకర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. వాస్తవంగా ఈ సినిమాని సుకుమార్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం ఇప్పటి వరకు గోప్యంగా ఉంచారు. ఈ రోజు చెప్పి ప్రేక్షకులకి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అన్ని భాషల ఫస్ట్ లుక్ పోస్టర్లనూ ఈరోజు విడుదల చేశారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని చిత్తూరు జిల్లాలోని శేషాద్రి అడవుల్లోల గందపు చెక్కలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని లేటెస్ట్ న్యూస్. అయితే థమన్ ని కాదని సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకిడైన దేవీశ్రీప్రసాద్ కి ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎవరూ దేవీ శ్రీ ప్రసాద్ మీద ఆసక్తిగా లేరన్న విషయం తెలిసిందే. అయినా సుకుమార్ దేవీశ్రీ ప్రసాద్ మీద నమ్మకంతో పుష్ప సినిమాకి ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఖచ్చితంగా అల్లు అర్జున్ సుకుమార్ లకి బ్లాక్ బస్టర్ ఇస్తానని దేవీశీ ప్రసాద్ ఈ సందర్భంగా అన్నాడట.