శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో మహిళా కండక్టర్ డ్యాన్స్.. ఇంతకీ ఎవరామె?

-

శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలో ప్రదర్శించిన మహిళా కండక్టర్ చేసిన ఫోక్‌ డ్యాన్స్‌ ఇప్పుడు కుర్రకారుని హుషారెత్తిస్తోంది. ఈ ప్రదర్శనకు మెచ్చి న్యాయనిర్ణేతలు సైతం వేదికపైకి వెళ్లి.. ఆమెతో కలిసి స్టెప్పులేసి అభినందించారు. ”నేను అట్టాంటి.. ఇట్టాంటి ఆడదాన్ని కాదు బాబోయ్‌… పల్సర్‌ బైక్‌ మీద రాను బాబోయ్‌..” అనే పాటకు డ్యాన్స్ వేసి ఆమె.. ఇంతకీ ఎవరు? తెలుసుకుందామా?

 

విశాఖపట్నం గాజువాక బీసీరోడ్డుకు చెందిన ఝాన్సీ ఆర్టీసీ డిపో కండక్టర్. ఆమె భర్త నూకరాజు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. అటు ఉద్యోగం, చేస్తూనే ఇటు ఆసక్తి ఉన్న కళలో ప్రశంసలందుకుంటున్నారు.

ఝాన్సీ 8వ తరగతిలో ఉండగానే డ్యాన్స్‌ నేర్చుకుంది. వాళ్ల ఇంట్లో నృత్య శిక్షణ వద్దని వారించినా… ఎంతో కష్టపడి ఇష్టంగా సాధన చేసింది. పదో తరగతి పాసయ్యాక.. 2011లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఎంపికైంది. ఏడాది శిక్షణ తర్వాత గాజువాక డిపోలో విధుల్లో చేరింది. డ్యాన్స్‌ మాస్టర్లు శివ, విశాఖ థ్రిల్లర్‌ వెంకట్, శేఖర్, సురేష్‌ వద్ద శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. రమేష్‌ మాస్టర్‌ అన్ని విధాలా ప్రోత్సహించి ఆయన బృందంలో చేర్చుకుని వివిధ వేదికలపై ఆమెకు ప్రదర్శనకు అవకాశం కల్పించారు.

”ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకూ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చా. అక్కడి ప్రతిభతోనే టీవీ షోల్లో అవకాశం దక్కింది. ఓ టీవీలో వచ్చిన డ్యాన్సింగ్‌ స్టార్‌ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నా. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం అందుకున్నా. మరో ఛానల్‌లో రంగం-2, ఇంకో టీవీలో ప్రసారమైన తీన్మార్‌లో ఉత్తమ డ్యాన్సర్‌ అవార్డులు పొందా. ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా… డ్యాన్సర్‌గా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటా. -ఝాన్సీ

ఈటీవీలో ప్రసారమవుతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో’లో డ్యాన్స్‌ చేసిన ప్రోమో గత కొద్దిరోజులుగా వైరల్‌గా మారింది. చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసలు తెలియజేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈనెల 28న ఆదివారం నేను డ్యాన్స్‌ చేసిన ఎపిసోడ్‌ ప్రసారమైంది. డ్యాన్స్‌ గురువు రమేష్, ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్‌ నాయకుడు శంకరరావు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యం.-ఝాన్సీ

Read more RELATED
Recommended to you

Latest news