Ram Charan: వీరాభిమానం అంటే ఇదే..రామ్ చరణ్ కోసం ఫ్యాన్స్ ఏం చేశారంటే?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా రామ్ చరణ్ కు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్స్ వేసి రామ్ చరణ్ అభిమానులను అలరించారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రామ రాజు పాత్రను ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషించారు. అల్లూరి సీతారామ రాజుగా, భీమ్ కు స్నేహితుడిగా, ప్రేమికుడిగా చక్కటి నటన కనబర్చారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి గెటప్ అభిమానులకు బాగా నచ్చింది.

ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలం గుడికల్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ వీరాభిమానులు అల్లూరి సీతారామరాజు, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రామరాజు గెటప్ లో విన్యాసాలు చేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా వారు చేసిన ఈ యాక్ట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వారందరూ కూడా రామ్ చరణ్ కు వీరాభిమానులు కాగా, ఈ గెటప్ లో వారందరూ బుల్లి రామ్ చరణ్ లాగా ఫీలవుతుండటం విశేషం. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news