అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా?

-

మన దేశంలో ఎన్నో ఆలయాలు వున్నాయి.. కొన్ని ఆలయాలు ఎన్నో రహస్యాలను కలిగి ఉన్నాయి.. వాటిలో కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ఒకటి. అనంత పద్మనాభస్వామి దేవాలయం.. గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే 2011లో ఆలయ పాలకమండలి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ఏ, బీ, సీ గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు.ఎంత తీసిన ఇంకా బంగారు నగలు,కంకనాలు వస్తూనే ఉండటం విశేషం..

ఉత్తరం వైపున రూమ్ డీ, ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్ది లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచానా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది..మొత్తం 11 లో ఐదు గదులను ఓపెన్ చేశారు..వాటిలో మొత్తం 5 లక్షలకు పైగా సంపద వున్నట్లు అధికారులు గుర్తించారు..

ఇకపోతే ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంత కాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు..వాటి అనంత స్వామికి అప్పగించి రక్షకులుగా ఉంటున్నారు.. ఇక 6 గదులు తెరిస్తే ఇంకెంత ఉంటుందో అని అందరు ఆలోచనలో ఉన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news