తీర్ధం తీసుకున్నాక చేతులని తలకి రాసుకుంటారా…? ఇది చూస్తే ఆ అలవాటు మానుకుంటారు…!

సాధారణంగా మనం దేవాలయానికి దేవుడికి దర్శించుకోడానికి వెళ్తాము. అప్పుడు పూజలు కానీ వ్రతాలు కానీ చేయించుకుంటూ ఉంటాము, లేదా సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి తీర్థప్రసాదాలను మనకు ఇస్తూ ఉంటారు.

అయితే తీర్థం తీసుకునే సమయంలో చాలా మంది తీర్ధం స్వీకరించాక ఆ చేతిని తలకి రాసుకుంటారు. అయితే నిజంగా తలకి తీర్థం తీసుకున్న చేతిని రాయొచ్చా…?, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించి ఎంతో ముఖ్యమైన విషయాన్ని పండితులు మనతో చెప్పడం జరిగింది.

గుడికి వెళ్ళినప్పుడు తీర్ధం తీసుకున్నాక మన చేతుల్ని తలపై రాసుకుంటాము. కానీ అది నిజానికి తప్పు. దేవాలయాల్లో తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అని చెబుతున్నారు పండితులు. అయితే తులసి నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ తయారు చేస్తూ ఉంటారు.

పంచామృతాలతో చేసిన తీర్ధాన్ని కానీ తులసి తీర్థం కానీ తలకు రాసుకోవడం మంచిది కాదు. తీర్ధం తీసుకున్నాక చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయని తలకు రాసుకోవడం మంచి ఫలితాన్ని ఇవ్వదు నిజానికి తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కడుక్కోవాలి. అంతేకానీ దానిని తలకు రాసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. కేవలం గంగాజలం అభిషేకం చేసిన తీర్థంని మాత్రమే తలపై రాసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా తీర్ధం విషయంలో ఈ తప్పులు చేయొద్దు.