దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి.. మహా పాపం…

-

మనదేశంలో దేవుళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు.. ఒక్కో దేవుడికి ఒక్కో రోజు పూజించడంతో పాటు ఒక్కో రకమైన నైవేద్యాలను సమర్పిస్తారు..దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసి కొన్ని పొరపాట్ల వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నైవేద్యం విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలి?.. ఎం చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దేవుళ్ళకు నైవేద్యం పెడతాము..ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదాన్ని సమర్పిస్తాం. అయితే నైవేద్యాన్ని సమర్పించే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండ గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో తప్పులు చేస్తే దేవుడి నిరాదరణకు గురి అవుతారు. కొంతమంది దేవుడికి నైవేద్యం సమర్పించిన వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు కొద్దీ సేపు దేవుడి దగ్గర వదిలేసి ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడికి తయారు చేసే పదార్ధాలను నూనెతో తయారు చేయకూడదు.. కేవలం నెయ్యి తో చేసిన పదార్థలను మాత్రమే దేవుడికి సమర్పించాలి..

ఇకపోతే నైవేద్యం కోసం కేవలం నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే మిరప కాయల తో చేసిన పదార్ధాలను దేవుడికి సమర్పించకూడదు. వండిన ఆహారాన్ని మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఆ తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే అంత కంటే ముందుగా ఆ ప్రసాదాన్ని ఆవుకి పెట్టాలి.. ఆవు కామాదేనువు.. గోమాత.. అందుకే ఆవును పూజిస్తారు.. ఆ తర్వాత మీరు తినాలి.. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని తప్పక గుర్తుపెట్టుకోవాలి.. ఏదైనా పొరపాటు జరిగితే మహాపాపం..

Read more RELATED
Recommended to you

Latest news