భోజనం యొక్క నియమాలు

-

 

 

భోజనం ఎలా చేయాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి, ఎలా వండాలి అనే ప్రతి విషయాన్ని నియమ నిబంధనల ప్రకారం చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి ఈ విషయాలు తెలియదు.

 

ముఖ్యంగా చెప్పే వాళ్ళు లేరు. చెప్పేవారు ఉన్న తెలుసుకునే స్థితిలో ఎవరూ లేరు. ఎవరి లోకంలో  వారు నిమగ్నమై ఉంటున్నారు.ఈ విషయంలో ఎవర్ని తప్పుపట్టలేం కానీ. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడం మన కర్తవ్యం మన ధర్మం.

 

 

సాధారంగా భోజనం చేయడానికి మన పూర్వీకులు కొన్ని నియమాలు విధించారు. ఇప్పుడు వాటిని గురించి  తెలుసుకుందాం.

1. భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. మనం అన్నం తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటునా ముట్టుకుంటే,  వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

3.  అన్నం తింటున్న సమయంలో ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. ముఖ్యంగా నేతి పదార్థాన్ని చూపించకూడదు.

4. అన్నం తినే సమయంలో ధ్యాస మొత్తం భోజనం మీదే ఉండాలి తప్ప వేరే విషయాలను ఆలోచించకూడదు. మనస్సును  నిర్మలంగా ఉంచుకోవాలి.

5. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే తినే దాన్ని  విడిచిపెట్టాలి.

6.  కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.

7. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

8. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

 

అన్నం పర బ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. మనం సాధ్యమైనంత వరకు ఆహారాన్ని వృధా చేయయకుండా ఉండటం ద్వారా ఒక మంచి కార్యం చేసేనట్లే. పైన పేర్కొన్న నియమాలు పాటించడం ద్వారా భగవంతుని కృపకు పాత్రులం అవ్వచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news