దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే..ఏదైనా అశుభమా..!!

-

భారతీయులు ఏదైనా శుభకార్యాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతారు..ప్రతి ఒక్క పూజకు కూడా కొబ్బరికాయ ఉండాల్సిందే..ఇంట్లో పూజ చేసే సమయంలో గుడికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇది చాలామంది కొబ్బరికాయను కొట్టినప్పుడు కుళ్ళిపోతే చాలా బాధపడుతూ మదన పడుతూ ఉంటారు.

కొబ్బరికాయ కుళ్ళిపోవడం అశుభంగా భావిస్తూ, కీడు జరుగుతుందని అని భావిస్తూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం ఎక్కడ కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆశుభం అని రాయలేదు. సాధారణంగా కొన్ని కొబ్బరికాయలు కుళ్లిపోయి ఉంటాయి. అదే విషయాన్ని మనకు తెలియదు కాబట్టి వాటిని దేవుడి దగ్గర కొడతాము. కానీ వాస్తవానికి దేవుడికి కొబ్బరికాయ పుష్పం ఫలం వీటిలో ఏది ఒకటి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అంతేకాకుండా అది ఎలా ఉన్నా పర్వాలేదు భక్తితో సమర్పిస్తే చాలు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు..అందుకే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే చింతించాల్సిన అవసరం లేదు..

కొన్ని సార్లు మనకు తెలియకుండా అలా కొబ్బరికాయలు కుళ్లిపోతూ ఉంటాయి. ఇంకొందరు అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం అని కుళ్ళిపోతే దురదృష్టమని భావిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. దేవుడికి పూజ చేసేటప్పుడు భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలిస్తే ఎటువంటి చింతలు కూడా దరిచేయకుండా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు..భక్తి అనేది బయటకు చూపించేది..మనసులో ఇష్టంగా భగవంతుడిని ఆరాదిస్తే ఆయన కరుణ మనమీద ఉంటుంది..

 

Read more RELATED
Recommended to you

Latest news