చాలామందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా తాగడం మంచిదని కొందరు అంటే, కాదని మరికొందరు అంటారు. కాఫీ సంగతి పక్కన పెడితే.. బ్రష్ చేయకుండా..వాటర్ తాగే అలవాటు అయితే అందరికీ ఉంటుంది. ఉదయం వాటర్ తాగడం మంచిదే కానీ..ఇలా బ్రష్ చేయకుండా వాటర్ తాగడం ఎంత వరకూ కరెక్టు. బ్రష్ చేయకముందు మననోరు అంతా దుర్వాసన వస్తుంది. వాటర్ తాగేస్తే..ఆ బాక్టీరియా అంతా లోపలికి వెళ్తుంది కదా..!
రోజూ ఉదయం లేవగానే నీళ్లు తాగండి. అది మీరు బ్రష్ చేయకపోయినా సరే ఏం కాదు అంటున్నారు సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్తగి. రోజు మొత్తానికి సరిపడ నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు ఒక్కటే.. హైడ్రేట్‌గా ఉంచి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది. అలా వేస్టేజ్‌ను కిడ్నీల నుంచి బయటకు పంపేస్తుంది. సెలైవాను క్రియేట్ చేయడం, పలు శరీర భాగాలకు న్యూట్రియంట్లను అందుబాటులో ఉంచుతుంది.
బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు…
నిద్రపోయినప్పుడు నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియాను మనం మింగడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందట. దాని వల్ల జీర్ణ క్రియ పెరిగి.. అరుగుదల లేకపోవడాన్ని అరికడుతుంది కూడా.
అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అలా ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు చెడు శ్వాసను కూడా దూరం చేస్తుంది.
సెలైవాను ఉత్పత్తి చేసి నోరు పొడిబారిపోకుండా రీహైడ్రేట్ అయ్యేందుకు హెల్ప్ అవుతుంది.
ఎలాంటి నీరు తాగాలంటే..
నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం బెటర్. లేచిన వెంటనే వీలైనంత త్వరగా కనీసం రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. ఒకేసారి కాకుండా..గ్యాప్ ఇచ్చి గంటలోపు కంప్లీట్ చేయాలి. నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. గోరు వెచ్చని వాటర్‌లో నిమ్మరసం, తేనె వేసుకుని తాగితే బరువు కూడా తగ్గుతారు. చాలా మంచి అలవాటు ఇది.