మన భారత దేశంలో ఉప్పు లేకుండా వంటలు చెయ్యరు..ఉప్పు కేవలం ఆహార రుచిని పెంచడం మాత్రమే కాదు..ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ఇది ఇంట్లో ఆనందం ,శ్రేయస్సును పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఉప్పును ఏ లోహపు పాత్రలోనూ ఉంచకూడదు. ఉప్పును ఎల్లప్పుడూ గాజు పాత్రలోఉంచాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం ,శాంతి నెలకొంటుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. వాస్తు శాస్త్రంలో ఉప్పు నివారణోపాయాలు తెలుసుకోండి. ప్రతి ఇంట్లో ఉప్పును ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంటి నుండి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి మీరు మీ బాత్రూంలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పును వేయాలి..ఇంట్లోకి నెగిటివ్ ఎనెర్జీని రాకుండా చేస్తుంది.
ఆర్థిక సంక్షోభంలో ఉంటే, ఉప్పు సమర్థవంతమైన నివారణ అని వాస్తు శాస్త్రంలో ఉంది. ఇందుకోసం ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల ఉప్పు, నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది..
ఒత్తిడికి గురైతే, వాస్తు శాస్త్రం ప్రకారం, ఆ వ్యక్తి ఉదయం స్నానం చేసేటప్పుడు స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా, వ్యక్తి ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే వ్యక్తిలో సానుకూల శక్తి కమ్యూనికేషన్ పెరుగుతుంది.
ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటే, ఆ వ్యక్తి చిటికెడు నల్ల ఉప్పును ఇంటిని తుడుచే నీటిలో కలిపి ఇంటిని తుడవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతిరోజూ ఇలా చెయ్యలేక పోతే వారంలో ఒకసారైనా అంటే మంగళవారం ఇలా చేయడం చాలా మంచిది.
కుటుంబ సభ్యులలో ఎవరైనా పదే పదే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే లేదా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే. అందుకే తన మంచం దగ్గర గాజు సీసాలో ఉప్పు ఉంచి ప్రతి నెలా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది..ఆ వ్యక్తి పూర్తీ ఆరోగ్యంగా మారే వరకూ ఇలా చెయ్యడం మంచిది.