వివో మొబైల్స్ సంస్థకు విరాట్ కోహ్లీ ఒక వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటనను వివో మొబైల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఆ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీకి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) విచారణ ప్రారంభించడంతో ఈ వ్యాపార ప్రకటనలు నిలిపివేసినట్లు ఆ కంపెనీ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ ఆరోపణలు కు వ్యతిరేకంగా వివో కంపెనీ పై దర్యాప్తు సంస్థ ఈడి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ పూర్తయ్యేంతవరకు ఈ సోషల్ మీడియా వ్యాపార ప్రకటనలను నిలిపివేస్తూ ప్రకటించింది.
ఈ పరిణామంతో స్పష్టత వచ్చేంతవరకు విరాట్ కోహ్లీ ప్రమోషనల్ యాక్టివిటీలను, ముందస్తుగా నిర్ణయించిన కార్యకలాపాలను ఆపివేయాలని నిర్ణయించినట్టు పేరు చెప్పడం ఇష్టం లేని ఓ అధికారి చెప్పారు. ఈ సమయంలో వ్యాపార ప్రకటన చేసేందుకు విరాట్ కోహ్లీ కూడా అసౌకర్యంగా భావిస్తున్నారని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ ప్రకటనలు నిలిపివేయడంతో కంపెనీ ఎదుర్కొనే విమర్శల నుంచి విరాట్ కోహ్లీ ని కాపాడినట్టు అవుతుందని ఎగ్జిక్యూటివ్ తెలిపారు.