మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా ఆరాధిస్తే..6 దోషాలు పోతాయట..

-

మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు..ఆంజనేయ స్వామిని సింధూరంతో పాటు ఆకుపూజ చేస్తే ఎన్నో ఏళ్లుగా పీడిస్తోన్న కష్టాలు, వ్యాధులు , దోషాలు తొలిగిపోతాయి. మీరు ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న ప్రత్యేక కోరికను నెరవేర్చకోవాలంటే ప్రతి మంగళ వారం, శనివారం బజరంగ్ బాన్‌తో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే.. మీకు గల సకల దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంతేకాదు బజరంగ్ బాన్ చదవడం ద్వారా కలిగే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం..
1. ధీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి,
2. చేసే పనిలో విజయం సాధించాడానికి ,
3. శత్రువులను జయించుటకు,
4. భయాన్ని తొలిగించుకోవడానికి,
5. చేసే పనుల్లో అడ్డంకులు తొలిగడానికీ,
6. ఆనందం శ్రేయస్సు మరియు చేసే పనిలో పురోగతి కోసం బజరంగ్ బాన్ తో పాటు ఆంజనేయ దండంక లేదా హనమాన్ చాలీసా చదవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.

హనుమాన్ చాలీసాను రోజూ చదవడం వల్ల చాలా మంచిది..ఎన్నో రోగాలు పోయి పాజిటివ్ ఎనెర్జీ వస్తుంది..దీర్ఘకాలిక రొగాల తో పాటు, కొన్ని పనులు కూడా నెరవేరుతాయి.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషెకాలు చేయించి, భక్తి శ్రద్దలతో పూజలు చేయడం వల్ల బాధలు పోయి సిరి సంపదలు కలుగుతాయి… మీరు కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని పునీతులు కండి..

Read more RELATED
Recommended to you

Latest news