సంతానం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం క‌లుగుతుంది!

-

(చైత్ర శుద్ధ అష్టమి -ఈ నెల 13న ప్రత్యేకం)

offer these prayers to goddess parvati to have children

దేశంలో ఎందరో దంపతులు సంతానం కోసం పలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ఎవ్వరు ఏది చెపితే దాని ఆచరిస్తారు. కానీ శాస్త్రప్రవచనం ప్రకారం భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక సంతానం పొందుతారు. అలాంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వ్రతం భవానీ అష్టమి వ్రతం.

పార్వతీదేవినే భవాని అంటారు. దీనికి కారణం భవుని భార్య కాబట్టి. పార్వతీదేవి చైత్ర శుద్ధ అష్టమినాడు జన్మించింది. ఆ పుణ్యతిథిని భవానీ అష్టమి అంటారు. దీనినే అశోకాష్టమి అని కూడా అంటారు.

వ్రతం ఎలా ఆచరించాలి?

చైత్ర శుద్ధ అష్టమినాడు ఇంటిముందు ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి, ఇంటికి మామిడాకు తోరణాలతో అలంకరించాలి. ప్రాతఃకాలమందే స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే సమయంలో గంగా, యమునా, గోదావరి, కఋష్ణ, కావేరీ, తుంగభద్ర వంటి నదుల పేర్లను స్మరించాలి.

స్నానానంతరం నూతన వస్ర్తాలను ధరించాలి. అనంతరం పార్వతీదేవి చిత్రపటాన్ని అశోకచెట్టు కింద ఉంచి భవానిమాతను పూజించాలి. షోడశోపచార పూజలు చేయాలి. అనంతరం ఎనిమిది అశోకమొగ్గలను దైవప్రసాదంగా భుజించాలి. ఇలా ప్రసాదం స్వీకరించినవారికి శోకం ఉండదు. శోకనివారిణి కాబట్టి ఈ చెట్టును అశోకమని అంటారు.

ఇప్పటికీ ఉత్తరభారతంలో స్త్రీలు తమ సంతతి క్షేమంగా ఉండాలని అశోకమొగ్గలను నీటిలో కలిపి సేవించే ఆచారం ఉంది.

సంతానం లేనివారికి ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం అవుతుందని పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందండి. ఇక ఆలస్యమెందుకు ఈనెల 13న అష్టమి వ్రతాన్ని ఆచరించండి. శుభం భూయాత్.

ఓం నమో పార్వత్యైయనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news