ఈ మంత్రాలు పఠిస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది..!

ఎంత సంపాదించినా కొందరికి నిల్వ ఉండదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా అరచేతిలో ఇసుకలా జారిపోతుంది. డబ్బంతా ఎక్కడికి పోతుందో అర్థం కాదు. అలాగని అనవసరపు ఖర్చులు చేస్తున్నామా అంటే అదీ లేదు. ఇలా చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. అయితే ఇదంతా లక్ష్మీ దేవి కటాక్షం లేకపోవడం వల్లేనట. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా, ఇంట్లో సంపద వృద్ధి చెందాలన్నా, సంపాదించింది నిలవాలన్నా ఈ మంత్రాలు చదవాలట. అయితే ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రం పఠించాలట. మీ రాశి ఏదో.. మీరు ఏ మంత్రం చదవాలో ఓ సారి చూడండి..

లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకోని వారుంటారా చెప్పండి..అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండాలంటే నిత్యం పఠించాల్సిన మంత్రం కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుంది. ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి..

మేష రాశి
ఓం ఐం క్లీం సౌహు

వృషభ రాశి
ఓం ఐం క్లీం శ్రీం

మిథున రాశి
ఓం క్లీం ఐం సౌహు

కర్కాటక రాశి
ఓం ఐం క్లీం శ్రీం

సింహ రాశి
ఓం క్లీం శ్రీం సౌహు

కన్యా రాశి
ఓం శ్రీం ఐం సౌహు

తులా రాశి
ఓం బ్లూం క్లీం శ్రీం

వృశ్చిక రాశి
ఓం ఐం క్లీం సౌహు

ధనస్సు రాశి
ఓం బ్లూం క్లీం సౌహు

మకర రాశి
ఓం ఐం క్లీం బ్లూం శ్రీం సౌహు

కుంభ రాశి
ఓం బ్లూం ఐం క్లీం శ్రీం

మీన రాశి
ఓం బ్లూం క్లీం సౌహు

లక్ష్మీదేవి కటాక్షం దక్కాలంటే.. 

లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి లేదా బంగారు నాణేలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది
పూజగదిలో నెమలి ఫించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది
తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది
వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో , దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయించుకోవాలి
లక్ష్మీదేవి ముందు చిన్న గిన్నెలో( వెండి అయితే ఇంకా మంచిది) బియ్యం, కొన్ని గవ్వలు వేస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది
అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు లేదా ఎరుపు ధరించి అష్టోత్తరంతో పూజ చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి
లక్ష్మీ స్వరూపం అయిన తులసికోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.