వాస్తు: పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి…!

వాస్తుని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని షేర్ చేసుకోవడం జరిగింది. వీటిని కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిట్కాలని కనుక ప్రతిరోజూ ఫాలో అయితే మీరు సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. కానీ ఇలాంటివి తెలుసుకుని.. ఆచరించడం చాలా మంచిది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు ఉంటాయి వాటి ప్రకారం అనుసరిస్తే శుభం కలుగుతుంది. అలానే సమస్యలేమీ ఉండవు.

ఎప్పుడూ కూడా మీరు పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని పూజ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా తూర్పు వైపు పూజ చేయడం వల్ల సామర్థ్యం మీకు కలుగుతుంది. ధైర్యం వస్తుంది. అలానే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి.

తూర్పు వైపు కూర్చుని పూజ చేస్తే జ్ఞానం కూడా పెరుగుతుంది. అలాగే పవర్ కూడా పెరుగుతుంది. మీరు అనుకున్నది సాధించడానికి కూడా అవుతుంది. ఎంతో శాంతాన్ని పొందొచ్చు. ధనం, ఆనందం కలిగి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. కనుక మీరు పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని పాటించండి. తద్వారా ఈ లాభాలని మీరు పొందండి.