శీతాకాలంలో బాధగా భారంగా అనిపిస్తోందా..? ఇలా ఆ సమస్య నుండి బయటపడచ్చు..!

-

ప్రతి ఒక్కరికి కూడా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ముఖ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చూస్తూ ఉండాలి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే శీతాకాలంలో ఏదో తెలియని లోటు, దిగులు ఉంటుంది. ఏ పనీ చేయడానికి మనకి తోచదు. మూడ్ కూడా బాగోదు. మనసంతా ఏదో బరువుగా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది..? దీని నుండి ఎలా బయటపడొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ ఇది. దీనిని షార్ట్ కట్ లో సాడ్ అంటారు. ఎక్కువగా ఇది చలికాలంలో కనబడుతూ ఉంటుంది ఏదో తెలియని దిగులు బాధ ఉంటుంది. మనం చేసే పని మీద దృష్టి వెళ్లదు. ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది. ఇలా ఇటువంటి లక్షణాలు మనకి ఈ కాలంలో కనబడుతూ ఉంటాయి. అయితే దీనికి గల కారణం ఏమిటంటే వాతావరణం చల్లగా మారిపోవడం, ఎండ తగిలే అవకాశాలు తగ్గడం వలన రక్తంలో సిరిటోనియన్ స్థాయిలు పడిపోతాయి ఈ కారణంగా ఏమవుతుంది అంటే మనసు బాగోదు.

డిప్రెషన్ కలుగుతుంది. ఒంట్లో డి విటమిన్ తగ్గడం వలన కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మళ్లీ సీజన్ మారిపోయిన తర్వాత బాగానే ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఊహించుకోవడం, చీటికిమాటికి ఏడవడం, కొన్ని ఆలోచనలు వలన ఆత్మహత్యకి కూడా పాల్పడుతూ ఉండేవారు వున్నారు.

ఇటువంటప్పుడు మంచి జీవన శైలి ని అనుసరిస్తూ ఉండాలి. ఎలా అయితే అన్ని సీజన్స్ లో మన పనులు మనం చేసుకుంటున్నామొ అదే విధంగా బద్దకించకుండా ఈ సీజన్లో కూడా మన పనులు మనం చేసుకోవాలి. చలికాలంలో వాతావరణం చల్లగా ఉందని టీ కాఫీలను ఎక్కువగా తీసుకోకండి. హెల్దీ గా ఉండే ఆహారాన్ని మాత్రమే డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news