మీ మాజీ భాగస్వామి గురించి ప్రస్తుత భాగస్వామితో అడగకూడని విషయాలు

మీ భాగస్వామి మాజీ ప్రియురాలు లేదా ప్రియుడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మీలో ఉంటుంది. కానీ ఇలాంటివి అడిగేటపుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలనేది తెలుసుకోవాలి. లేదంటే ఆ ప్రశ్నలు ఒక్కోసారి మీ ప్రస్తుత భాగస్వామ్య బంధాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. మీ ప్రియురాలు లేదా ప్రియుడి మాజీ భాగస్వాముల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

 

relationship

శృంగార జీవితం

మీ ప్రియురాలి లేదా ప్రియుడితో మాజీ భాగస్వామి శృంగార జీవితం గురించిన ప్రశ్నలు అస్సలు అడక్కూడదు. దానివల్ల అనవసర పోలికలు ఏర్పడి మీ మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల మీ బంధానికి బీటలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

నన్ను నువ్వు మాజీ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా?

ఇది పిచ్చి ప్రశ్న. ఒకవేళ దీనికి సమాధానంగా మాజీనే ఎక్కువ ప్రేమిస్తున్నాన్న మాట వస్తే అది మీరు తట్టుకోలేరు. మానసికంగా కృంగిపోతారు. అవతలి వారికి ఆన్సర్ చెప్పే ధైర్యం ఉన్నా మీకు క్వశ్చన్ అడిగే అలవాటు ఉండకూడదు. అది మీకే మంచిది కాదు.

కుటుంబ విషయాలు

కారణమేదైనా మాజీలు అయిపోయారు కాబట్టి వారి ఫ్యామిలీ గురించి మీకనవసరం. మీ ప్రస్తుత భాగస్వామి కుటుంబంతో ఎలా గడిపారన్నది మీకు సంబంధించినది కాదు. ప్రస్తుతం మీరేం చేస్తున్నారనేదే మీ విషయం.

మాజీ పేరు

మాజీల పేర్లు మీకెందుకు? ఏం చేసుకుంటారు. ఒక వేళ తెలుసుకున్నారనుకుందా.. ఆ పేరుతో సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తారు. దానివల్ల మీకే సమయం వృధా అన్న సంగతి మర్చిపోవద్దు.

మాజీల ప్రత్యేక లక్షణం

అవతలి వారి మాజీల ప్రత్యేక లక్షణం ఏమిటి? వారు ఎలా స్పందిస్తారు? అన్న విషయాలు మీరు తెలుసుకున్నారనుకో.. మీ భాగస్వామితో స్పందించే ప్రతీ విషయంలోనూ మాజీ ఐతే ఇలా స్పందించి ఉండేవాడేమో అన్న ఆలోచన వస్తుంది.