రామ సేతు నిజమే.. దాన్ని కట్టించింది రాముడే.. మన పురణాలు నిజమే..

-

చాలా ఏళ్ల నుంచి అంతు చిక్కని మిస్టరీగా మిగిలిన రామ సేతు గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. రామసేతు స్వయంగా ఆ శ్రీరాముడే కట్టించాడని నిజంగా రామసేతు ఉందని నమ్మేవారు కొందరైతే.. అక్కడ ఎలాంటి వారధి లేదని వాదించేవారు కూడా మరికొందరు ఉన్నారు.

రామసేతు రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల నమ్మకం. త్రేతా యుగంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లాడు.అప్పుడు హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు ఇలా సముద్రంపై వంతెనను వానర సేన నిర్మించింది.ఇక ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే క్రీస్తుశకం 9వ శతాబ్దం దాకా పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధైగా పిలుస్తుండేవారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వారధి 1480 దాకా ఉంది. ఆ తరువాత తుఫానులతో కొంత ధ్వంసమైంది.

మొత్తానికి మన రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది మన ఇస్రో. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కానే కాదని ఇది ఖచ్చితంగా వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసి భారతీయులకు శుభవార్త చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్-2 డేటాను ఉపయోగించి రామసేతు మ్యాప్‌ను విడుదల చేయడం జరిగింది. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు మొత్తం 29 కిలోమీటర్లు ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఎత్తులో ఉండి వచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రామసేతు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ దాకా విస్తరించి ఉంది. అప్పట్లో దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఈ వారధి ఏకంగా 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రామసేతును కనుగొనడంలో చాలా రకాల ఆటంకాలు కలిగాయి. ఆ వారధి చరిత్ర ఏకంగా 18 వేల సంవత్సరాల కిందటిది. ఇక ఇప్పుడు ఇస్రో రామసేతు ఉందన్న విషయాన్ని కన్ఫామ్ చేసింది. రామసేతును కనుగొనేందుకు కొన్నాళ్ల నుంచి ఎన్నో పరిశోధనలు చేస్తోంది ఇస్రో. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేయడం జరిగింది. రామాయణం స్టోరీతో ఈ బ్రిడ్జ్ మ్యాచ్ అవుతుంది. పైగా ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద బ్రిడ్జిని కట్టే టెక్నాలజీ మనుషులకి తెలీదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వానర సైన్యం మాత్రమే కట్టగలరు. కాబట్టి మన పురాణాలు ముమ్మాటికీ నిజాలు. రాముడు నిజంగా ఉన్నాడు అనడానికి ఇంత కంటే పెద్ద సాక్ష్యం లేదు. మన పురాణాలు మన చరిత్ర. ఇది ముమ్మాటికీ నిజం..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version