వాస్తు: ఈ తప్పులు చేస్తే ధన నష్టం కలుగుతుంది..!

వాస్తు పండితులు మనతో కొన్ని విషయాలు చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే ధన నష్టం కలగకుండా జాగ్రత్త పడవచ్చు. చాలా మంది చీపురుకట్టకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే చీపురుకట్టని లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీదేవి ధనం ఇస్తుంది.

దీపావళి రోజున ఇళ్లల్లో కొత్త చీపురుని ఎంతో మంది పూజిస్తారు. మీ ఇంట్లో ధన నష్టం కలగకుండా ఉండాలంటే చీపురుకట్టకి సంబంధించి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుకట్టను కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

చీపురు కట్టని కొనుగోలు చేయాలంటే శనివారం నాడు మంచిది. కాబట్టి శనివారం నాడు కొనడానికి ప్రయత్నం చేయండి. కృష్ణపక్షంలో శనివారం నాడు కొంటె మరీ చేస్తే మంచిదని పండితులు అంటున్నారు.

వంట గది లో చీపురుకట్టని పెట్టడం వల్ల ఆహారం లో కొరత ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి చీపురుకట్టను వంటగదిలో పెట్టొద్దు. అదే విధంగా వంట చేసే ప్రదేశంలో దానిని పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

ఇంట్లో ఉండే చీపురు కట్ట డబ్బులు లాగ ఎవరికీ కనిపించకుండా దాచుకోవాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎవరికీ కనపడని చోట పెట్టడం మంచిది. అంతే కాకుండా ఎప్పుడు నించో పెట్టి చీపురుకట్టను పెట్టొద్దు. దీని వల్ల డబ్బులు ఉండవు. అదే విధంగా విరిగి పోయిన చీపురుని ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదు. దానిని తొలగించాలి లేదు అంటే ధననష్టం కలుగుతుంది.