దత్త క్షేత్రం శ్రీవల్లభాపురం!!

-

దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||

త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది.

వల్లభాపురం- మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రం లో గల వల్లభపురం గ్రామం లో వెలసిన మహిమన్మితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం . దత్తత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రం . శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ స్థలం పీటాపురం అయితే తన తపస్స్సు,ధ్యానం అన్ని కుర్వాపూర్ లోనే జరిగాయి . వల్లభాపురం తెలంగాణా మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది . కృష్ణ నదికి ఇవతలి వైపు వల్లభాపురం,అవతలి వైపు కురువాపూర్ ఉంటుంది .

కృష్ణ నది సమీపం లో వెలసిన మహిమన్మితమైన దత్త పీటం ఇది . శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రం లో కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి భక్తులు కష్టాలు తీర్చాడని స్థానిక కథనం. కష్టాలు వచ్చినప్పుడు కానీ ,దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకోడానికి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని స్థల పురాణం !!

శ్రావణ పౌర్ణిమ, దత్త జయంతికి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి. స్వామి వారిని దర్శించుకోవడానికి తెడ్డు పడవలో తెలంగాణ లోని వల్లభపురం నుంచి కర్ణాటక లోని కురవైపుర్ వెళ్లి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలి. వల్లభపురం నుంచి కర్ణాటక లోని కురవైపుర్ వెళ్లి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలి.అందమైన ప్రయాణం ఎన్నో మధురనుభూతులు మిగులుస్తుంది. ఇక్కడికి హైదరాబాద్ నుండి మక్తల్ కి వెళ్లి అటు నుండి ఈ క్షేత్రాన్ని చేరుకోవొచ్చు. వల్లభాపురం లో గదులు,భోజనం వసతి లబిస్తాయి .

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news