వసంత పంచమి తేదీ.. సరస్వతీ పూజ వివరాలు విశిష్టత..

-

మనదేశంలో పండగలకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. సాధారణంగా ఎలాంటి జీవితం గడుపుతున్నా కూడా పండగ రోజు కొత్త ఉత్సాహమేదో వచ్చి చేరుతుంది. చిన్నపిల్లలకి కొత్త బట్టాలు వచ్చాయన్న ఆనందం. పెద్దవాళ్ళకి తమ పిల్లలు తమ దగ్గరికి వచ్చారన్న ఆనందం. మధ్యవయస్కులకి జీవితం ఇంకా అందంగానే ఉందన్న సంతోషం. వీటన్నింటినీ మోసుకొచ్చే ఎన్నో పండగలు మన సంస్కృతిలో కనిపిస్తాయి. అలాంటి మరో పండగ తేదీ రానే వచ్చింది. అదే వసంత పంచమి.

వసంత రుతువులోకి అడుగుపెడుతున్న వేళ వసంత పంచమిని జరుపుకుంటారు. అన్ని రుతువుల్లో కెల్లా వసంత రుతువుకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రుతువులో ప్రకృతి కొత్త రెక్కలు విచ్చుకుంటుంది. చూడడానికి చాలా కొత్తగా ఉండడంతో వసంత రుతువుని రుతువుల రాణిగా పిలుస్తారు. ఐతే వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరుపుకోవడం ఆనవాయితీ. విద్యనిచ్చే చదువుల తల్లి సరస్వతికి పూజ చేసి, తమ కోర్కెలు తెలియజేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు.

విద్య అంటే పాఠశాలకి వెళ్ళి చదువుకోవడం మాత్రమే కాదు. కళలు, పెయింటింగ్, రచన, ఇలా ఏదైనా కావచ్చు. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. ఈ రోజున సరస్వతి పూజలో భాగంగా చాలా మంది తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీ దేవికి పూజ చేసి,మొదటిసారిగా విద్య నేర్చుకోవడానికి పంపిస్తారు. దానికోసం చాలా మంది సరస్వతీ దేవాలయమైన బాసరని జనం పోటెత్తుతారు.

ఇండియాకి తూర్పు భాగాన ఉన్న రాష్ట్రాల్లో వసంత పంచమి రోజున ఒక విచిత్రమైన ఆచారం ఉంటుంది. ఇండియాకి తూర్పు భాగాన ఉన్న రాష్ట్రాల్లో వసంత పంచమి రోజున ఒక విచిత్రమైన ఆచారం ఉంటుంది. వసంత పంచమి రోజున తమ పిల్లల్ని పుస్తకాలకి దూరంగా ఉంచుతారు. సరస్వతి దేవి పూజలో కూర్చుంటారు. అలా పుస్తకాలని ముట్టకుండా ఉంచడమే దేవుడికి ఇష్టం అని నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news