వాస్తు: బీరువాలో ఈ వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వెయ్యడం ఖాయం..!!

-

కొంతమందికి వేలకు వేలు వస్తున్నా కూడా డబ్బులు చేతిలో అస్సలు నిలువదు..అయితే మనం అధిక ఖర్చుల నుంచి బయట పడాలంటే మాత్రం డబ్బులను దాచుకోనే చోట కొన్ని వస్తువులను ఉంచాలని పండితులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందట. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందట..ఎవరైనా సరే ఇంట్లో నైరుతి దిక్కులో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి, నైరుతిలో కూడా దక్షిణం నైరుతి పడమర నైరుతి అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండిటిలో కూడా దక్షిణ నైరుతిలో బీరువా ఏర్పాటు చేసుకోవాలి.

దక్షిణ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటాయి, ఉత్తరం కుబేర స్థానం, ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడట..బీరువా ఇంట్లో దక్షిణ నైరుతిలో పెట్టుకున్నప్పుడు చాలామంది తెలియక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో ఉంచుతారు, బీరువాలో కూడా ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు, తెల్లటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేయాలి దానికి కారణం ఏమిటంటే నవగ్రహాలలో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు.శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు..అందుకే బీరువాలో డబ్బులను పెట్టే చోట తెల్లని వస్త్రాన్ని ఉంచాలి.

లోపలి తలుపుకి కుడి చేతితో బంగారం నాణాలు వర్షిస్తూ వరద ముద్రలో పద్మంలో కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం ఉంటే మంచిదట. లక్ష్మీదేవికి వట్టివేళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహాంకి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేళ్ళు కలిపినా నీళ్లతో అభిషేకం చేస్తారు. అలాగే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు, విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వట్టి వేళ్ళు ఈ రెండు కూడా ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి…ఇకపోతే వట్టివేళ్ళు ,పచ్చ కర్పూరం వెండి లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్ర బీరువాలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుందట.ఆ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.. శ్రావణమాసంలో ఇలాంటివి చెయ్యడం తప్పనిసరి..

Read more RELATED
Recommended to you

Latest news