హుస్నాబాద్ గురుకులంలో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్

-

తెలంగాణలో కరోనా మరోసారి విలయం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ ప్రజల్ని మళ్లీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులపై కొవిడ్ పంజా విసురుతోంది. అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 20మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం పాఠశాలలో జ్వరంతో ఉన్న విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి కరోనా పరీక్షలు చేయగా.. మొదట ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.  దీంతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు.

పాఠశాలలో మొత్తం 172మంది విద్యార్థులు, 39 మంది బోధనా, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. ఇందులో 16మంది విద్యార్థినులకు, ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లకు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన 16మంది విద్యార్థినులను ఇళ్లకు పంపిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news