మనుషులు, ప్రదేశాలతోనే కాదు కొన్ని వస్తువులతోనూ మనకు విలువైన జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని వస్తువులతో మనకు ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగం లేకపోయినా వాటిని భద్రంగా దాచుకుంటాం. అలా మన ఇళ్లలో విలువైన జ్ఞాపకాలుగా భద్రంగా ఉన్న వస్తువులెన్నో. కానీ వాస్తుప్రకారం ఇంట్లో ఎక్కువ కాలం ఉపయోగంలేని వస్తువుల్లో రాహు, కేతువులు, శని నివాసముంటారట. అందుకే ఇంట్లో ఉపయోగం లేని వస్తువులను బయట పడేయాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని వస్తువులు రాహుకేతువులకు ఆవాసమంట. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి.. మీ ఇంట్లో నుంచి వెంటనే బయటపారేయండి.
ఆగిపోయిన గడియారం.. ఇంట్లో ఉండే గడియారాలు పాడవుతుంటాయి. అయితే గడియారం డిజైన్ అందంగా ఉంటే అది నడవకపోయినా అలాగే ఉంచేస్తుంటాం. కానీ వాస్తు ప్రకారం ఉపయోగించని గడియారాలు బ్యాడ్ టైంని సూచిస్తాయట. అలాంటి గడియారాలను దానం చేస్తే మంచిది.
పాత బట్టలు.. కొన్ని దుస్తులను మనకు ఎంతో నచ్చి కొనుక్కుంటాం. అయితే అవి కొద్దిరోజులకే పాడైపోతే వాటిని పారేయాలనిపించదు. అలాగని వేసుకోలేం. అందుకే వాటిని భద్రంగా దాచుకుంటాం. పాత బట్టలు, పరుపులు, బొంతలు, షీట్స్ వంటివి స్టోర్ రూమ్లలో పెట్టేస్తాం. వీటిని అలా భద్రపరచడం వలన జాతకంలో బుధగ్రహం స్థానం క్షీణిస్తుందట. అలాగే పాత బట్టలను ఎండలో వేస్తారు. ఇలా చేయడం వలన రాహు కేతవుల ప్రతికూల శక్తి ఇంట్లో పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.
ఇత్తడి పాత్రలు.. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వస్తువుల వాడకం తగ్గిపోయింది. వీటిని ఎక్కువగా స్టోర్ రూమ్ లలో ఉంచుతున్నారు. అయితే వీటిలో శని ఆవాసంగా మార్చుకుంటాడట. ఇవి ఎక్కువ కాలం ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా ధనం పట్ల ఆకర్షితులవుతారు.
తుప్పు పట్టిన వస్తువులు.. ఇంట్లో ఇనుప పనిముట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడం వలన తుప్పు పట్టేస్తాయి. ఇంట్లో ఈ తుప్పు పట్టిన వస్తువులు ఉండడం వలన ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వాస్తు ప్రకారం పదునైన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులు మరింత ప్రమాదకరం. వీటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.
కుట్టు మెషీన్.. చాలా మంది ఇళ్లలో కుట్టు మిషన్స్ ఉంటాయి. అయితే వీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటారు. కొందరు కుట్టు మిషన్ ఉపయోగించకుండా ఖాళీగా పక్కన పెట్టేస్తుంటారు. దీనిని వాడకుండా ఉంచడం వలన ఇందులో రాహు, శని ఉంటారట. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో ఇంట్లో గొడవలు పెరుగుతాయి.