వాస్తు: ఈ మొక్కలని ఇంట్లో ఉంచద్దు.. సమస్యలు వస్తాయి..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుకి తగ్గట్టుగా అనుసరిస్తున్నారు వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈ విధంగా మీరు అనుసరిస్తే ఎలాంటి బాధ కూడా ఉండదు. మీరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా..? మంచి జరగాలని కోరుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ తప్పులు చేయకండి.

 

మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన ఇబ్బందులు వస్తాయి పైగా ప్రశాంతంగా ఉండడానికి కూడా అవ్వదు. ఇంట్లో ఈ మొక్కలు లేకుండా చూసుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మొక్కలని ఉంచకూడదని పండితులు అంటున్నారు. మరి ఎటువంటి మొక్కలు ఇంట్లో ఉంచకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో గోరింటాకు మొక్క ఉంటే నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. కాబట్టి ఇంట్లో గోరింటాకు మొక్కని ఉంచకండి ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండటం వలన ఇబ్బందులు వస్తాయి. అలానే చింత మొక్క కూడా ఇంట్లో ఉండకూడదు చింత కూడా చింతని కలిగిస్తుంది కాబట్టి చింతకాయ చెట్టుని చింత మొక్కని అసలు ఉంచకండి.

పత్తి మొక్క కూడా మంచిది కాదు పత్తి మొక్క ఇంట్లో ఉండడం వలన ఆర్థిక నష్టం వస్తుంది. ఇబ్బందులు వస్తాయి. అలానే బోన్సాయ్ మొక్కని కూడా ఇంట్లో ఉంచకూడదు ఇది కూడా ఇబ్బందులను తీసుకువస్తుంది. రావి మొక్కని కూడా అసలు ఇంట్లో ఉంచకండి వీటి వలన సమస్యలు వస్తాయి కాబట్టి ఎటువంటి తప్పులు మీరు చేయకుండా చూసుకోండి దానితో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news