వాస్తు : పక్షులను ఇంట్లో పంజరాల్లో పెట్టి పెంచుతున్నారా..? కష్టాలు కొనితెచ్చుకున్నట్లే..

ఇళ్లలో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవడం ఈరోజుల్లో కామన్‌ అయిపోయింది. కానీ కొంతమందికి ఇక్కడితో ఆగరు..కుక్కలు, పిల్లుల ఎవరైనా పెంచుకుంటారు..మనం పక్షలు పెంచుకుందాం వెరైటీగా ఆలోచిస్తారు. ఇంటికొచ్చిన పావురాలకు మేత వేస్తే సరిపోతుంది.. కానీ పక్షల మీద ఉన్న ప్రేమతో వాటిని పంజరాల్లో పెట్టి మరీ పెంచుకోవడం అనేది స్వార్థం అవుతుంది. వాస్తు నియమాలు పాటించకుండా పంజరాల్లో పక్షుల్ని పెంచుకోవడం వల్ల ఇంటి వాస్తు దెబ్బతింటుంది.

ఇంట్లో పక్షులను పెంచటం కోసం వాస్తు నియమాలు అతిక్రమించకూడదు. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. వాస్తు శాస్త్రంలో పక్షులను ఇంట్లో ఉంచుకోవడం నిషిద్ధం. పక్షులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. పక్షులను వదిలి ఉండలేని వారు ఇంట్లో పక్షులను పెంచుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. లేకపోతే, దురదృష్టం మీ వెంటే ఉంటుంది. పక్షి గురించి వాస్తు శాస్త్రంలో ఏం ఉందంటే..

పంజరం తలుపును మూయొద్దు.. పక్షులను పెంచుకునే వారు పంజరం తలుపులు మూయకూడదు…మీ పెంపుడు జంతువుపై చూపించే అంతటి ప్రేమ, శ్రద్ధ చూపిస్తే దానికి పంజరం అవసరం లేదు. అది ఎక్కడికి వెళ్లినా తిరిగి తిరిగి మళ్లీ మీ ఇంటికే వస్తుంది. అలా కాకుండా దాన్ని బందిస్తే..తప్పు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. పంజరం తలుపు పెట్టడం శుభసూచకం కాదు. పక్షిని పంజరంలో ఉంచడం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతుందట..

పక్షిని ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. స్వేచ్చగా ఎగురుతున్న పక్షిని గూడులో బంధించి ఉంచితే అనేక సమస్యలు ఎదురవుతాయి.. పురాణాలలో కూడా పక్షులను పంజరాలలో ఉంచకూడదని చెప్పారు.. పక్షులను పట్టుకోవడం పాపపు పనిగా జ్యోతిశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.. బుధవారం చిలుకను విడిచిపెట్టండి.. చిలుకను బుధ గ్రహంతో పోల్చారు. పంజరంలో ఉన్న చిలుకను విడిపించాలనుకుంటే ఆ పని బుధవారం చేయండి.

పక్షులు శ్రేయస్సు, విజయానికి చిహ్నాలు. వాటికి సేవ చేయడాన్ని పుణ్య కార్యంగా చెప్తారు. పక్షులకు మొక్కజొన్న తినిపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. పక్షిని రోజంతా బోనులో ఉంచితే ఇంట్లో స్థిరత్వం ఉండదు. ఆర్థిక నష్టానికి దారి తీస్తోంది. పక్షి నిద్రిస్తున్నప్పుడు మాత్రమే మీరు పంజరాన్ని ఉపయోగించాలి.

వాస్తు ప్రకారం పక్షులను పెంచుకోవడం మంచి పని కాదు. జీవితంలో ఆనందం, విజయం కావాలంటే మీరు ఇంట్లో పక్షుల ఫోటోను ఉంచవచ్చు. పక్షుల ఫోటోలు ముఖ్యంగా చిలుకలు ఇంట్లో సానుకూల ఫలితాలను తెస్తాయి కాబట్టి..చిలుకల ఫోటోలు పెట్టుకోండి.