వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు అన్ని దూరం అవుతాయి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఫాలో అవుతున్నారు. వాస్తు ప్రకారం అనుసరించి బాధలు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను ఇప్పుడు చూద్దాం. పండితులు ఇంట్లో అసలు ఈ చెట్లు ఉండకూడదని అంటున్నారు. మరి ఏఏ చెట్లు ఇంట్లో ఉండకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
రావి చెట్టు:
రావి చెట్టు ఆక్సిజన్ కి మంచి వనరుగా పరిగణించబడుతుంది. అయితే ఇంటి దగ్గర రావి చెట్టు ఉండకూడదు. దాని నీడ ఉన్నంతవరకు నాశనం చేస్తుందని అంటారు కాబట్టి రావి చెట్టుని అసలు ఉంచొద్దు.
వేప చెట్టు:
వేప చెట్టును కూడా అసలు ఇంట్లో ఉంచొద్దు. దీని వలన పేదరికం వస్తుంది.
రేగు చెట్టు:
రేగు చెట్టును కూడా ఇంట్లో ఉంచకూడదు ఇది కూడా ఇబ్బందుల్ని కలిగిస్తుంది.
ఖర్జూర చెట్టు:
ఖర్జూర చెట్టు మీ ఇంట్లో ఉంచకూడదు ఇది నష్టానికి గురిచేస్తుంది కాబట్టి ఈ చెట్టుని కూడా అస్సలు ఇంట్లో ఉంచకండి.
పాక చెట్టు:
ఈ చెట్టును కూడా ఇంట్లో ఉంచకూడదు ఇది కూడా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ చెట్టును కూడా ఉంచొద్దు.
పనస చెట్టు:
పనస చెట్టు ఇంట్లో ఉండడం వలన ఇబ్బందులు వస్తాయి. పనస మొక్కని అస్సలు ఇంట్లో నాటకండి. ఇది అశుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇంట్లో దరిద్రం కూడా వస్తుంది.