దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేగేషన్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
అయితే ఈ బెయిల్ నిబంధనలతో కూడినట్లు ఉంటుందని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు జమ చేయాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఢిల్లీ మద్యం కేసులో కవిత ఆడిటర్ గోరంట్లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడగించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరగా…. సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీని పెంచింది. ఈ విషయంపై
తదుపరి విచారణను మార్చి 9 వ తేదీకి వాయిదా వేసింది.