వాస్తు: బల్లి కనపడితే సమస్యలు వస్తాయా..?

చాలా మంది అంటూ ఉంటారు ఇంట్లో బల్లిని చూస్తే అశుభమని.. ఇబ్బందులు వస్తాయని. మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా అనడం విన్నారా..? అయితే నిజంగా బల్లిని చూస్తే సమస్యలు వస్తాయా..? మరి ఇక ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడు మనం చూద్దాం. బల్లిని చూడడం వల్ల కొన్ని రకాల సమస్యలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అయితే ఎప్పుడు చూసాము..?, ఎక్కడ చూసాము అనేది కూడా ముఖ్యమని అన్నారు.

దీపావళి రోజు రాత్రి కనుక బల్లి కనబడింది అంటే అది చాలా మంచిది. అది లక్ష్మీ దేవిని తీసుకు వస్తుందని అంటూ ఉంటారు. అలానే కొత్త ఇంట్లో కానీ గృహప్రవేశం సమయంలో కానీ బల్లిని చూస్తే పితృదేవతలు సంచరిస్తున్నట్లు దానికి అర్థం.

అలానే కల లో కనుక బల్లి కనబడింది అంటే అది కూడా మంచిదే అని పండితులు అంటున్నారు. ఆర్థికంగా మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అదే ఒకవేళ బల్లులు కొట్టుకోవడాన్ని మీరు చూసారంటే మీ ఇంట్లో కూడా గొడవలు కలుగుతాయని దానికి అర్థం. నేల మీద బల్లి పాకుతూ నడుస్తుంది అంటే అది భూకంపం లేదా సునామీ లాంటి వాటిని సూచిస్తుంది అని అర్థం