పెగడపల్లి మండలంలో బ్రిడ్జిల నిర్మాణం పనులకు రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని బతికపల్లి లింగపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జికి రూ.2 కోట్లు, మద్దులపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణంకు రూ.50 లక్షలు, అడుపపల్లిలో బ్రిడ్జి నిర్మాణంకు రూ. 80 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.