కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం ఈనెల 25న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.