ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ప్రభుత్వ వసతీ గృహాల్లో మౌళిక వసతుల కల్పనలో జాప్యం కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా సరైన సదుపాయాలు, వంట గదులు లేక నేటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేయాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుబ్రమైన పరిసరాలతో విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారు. అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.