వలిగొండ: వెల్వర్తి గ్రామానికి చెందిన బూడిద పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదువుకొని ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పని చేయాలని ఇటీవల తండ్రి మందలించడంతో కళ్యాణ్ మనస్థాపానికి గురై వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కళ్యాణ్‌ను గమనించిన తండ్రి 108 వాహనంలో భువనగిరి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు