చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు. తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 10 మంది స్వల్పంగా గాయపడ్డారు.