డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(21)ప్రెవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మొన్న అర్ధరాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం అతడి కోసం గాలించగా, చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.