రంగారెడ్డి : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్ పర్సన్ పిలుపు విశాలరెడ్డి అన్నారు. కేశంపేట ICDS, హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడ పిల్లను చదివిద్దాం అనే నినాదంతో అందరం కలిసి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జయంత్, చైర్మన్ నరేందర్, CDPO నాగమణి ఉన్నారు.